ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలోని బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లోని పెద్ద కందుకూరు రోడ్ లో ఉన్న బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి శనివారం అక్క స్పీకంగా తనిఖీ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లో ఉప్మా నాణ్యత లేదని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు దాన్ని మార్చడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు, పేద పిల్లలకు పెట్టే అన్నంలో కక్కుర్తి పడవద్దని, నాణ్యత లోపించకుండా మంచి ఆహారం అందించాలని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల సిబ్బందికి సూచించారు