రైతుగా మారిన నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ
నరసరావుపేట మండలం ఇక్కుర్తిలో బుధవారం సాయంత్రం5 5గంటలకు 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ, రైతుగా మారి ట్రాక్టర్తో స్వయంగా పొలాన్ని దమ్ము చేశారు. రైతులకు యూరియా అందుబాటులో ఉందని, కానీ పంటకు అవసరమైన మేరకే ఎరువులను వాడాలని ఆయన సూచించారు. అధికంగా యూరియా వాడి చీడ పీడలను ఆహ్వానించొద్దని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు కూడా పాల్గొన్నారు.