జలమే జీవనాధారం అది దైవంతో సమానం: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
Ongole Urban, Prakasam | Apr 6, 2026
జలమే జీవనాధారమని, అది దైవంతో సమానమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి చెప్పారు. నీటి వనరులను కాపాడుకుంటూ భూగర్భ నీటి మట్టాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ' జల ధార - జల హారతి ' కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబుతో కలిసి సోమవారం వల్లూరు చెరువు వద్ద ఆయన ప్రారంభించారు. ముందుగా వల్లూరమ్మ ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు చెరువులో గంగమ్మకు ప్రత్యేక హారతి ఇచ్చి చీర, సారెలను వదిలారు.