నిజామాబాద్ సౌత్: పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు చెల్లించాలని నగరంలో TUCI ర్యాలీ కలెక్టరేట్ ఎదుట ఆందోళన
నగరంలోని జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట TUCI ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా TUCI జిల్లా కార్యదర్శి R రమేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి మందికి పైగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాలు గత రెండు నెలల నుండి చెల్లించడం లేదన్నారు. గ్రామాలలో అతి తక్కువ వేతనానికి పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు దాదాపుగా రెండు నెలల నుండి వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. గ్రామానికి సేవ చేస్తున్న ఇలాంటి శ్రమజీవులకు ప్రతినెల వేతనాలు ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు.