ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని కొత్తపట్నం బస్టాండ్లో ఆటో డ్రైవర్లకు చిరు వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ హజరతయ్యా
Ongole Urban, Prakasam | May 17, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం ఆటో డ్రైవర్లతోపాటు చిరు వ్యాపారులకు సీఐ హజరతయ్యా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపలని సూచించారు. చిరు వ్యాపారులు పట్టణంలో ట్రాఫిక్కుకు అంతరాయం కలగకుండా వ్యవహరించాలని లేదంటే వారిపై చర్యలు తీసుకుంటూ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అవినీతికి మించి ఆటో డ్రైవర్లు తమ వాహనాలలో ప్రయాణీకులను తరలించరాదని సూచించారు.