బోయిన్‌పల్లి: వెంకట్రావుపల్లిలో కారును ఢీ కొట్టి వెళ్లిపోయి న గుర్తు తెలియని వాహనం ఇరువురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలం,వెంకట్రావు పల్లి శివారులో కారును ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయిన ఘటన మంగళవారం 9:50 PM కి చోటు చేసుకుంది,కామారెడ్డి నుండి 4గురు కారులో కరీంనగర్ వెళ్తుండగా,వెంకట్రావు పల్లె గ్రామ సమీపం లో గుర్తు తెలియని భారీ వాహనం కారును వెనుక నుంచి ఢీ కొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది,కారులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడగా,డ్రైవర్ మరొక మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి,మహిళ తల పగిలి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది,హుటాహుటిన స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు, మహిళ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్ తరలించారు,