ఇల్లందకుంట: సిరిసేడు సొసైటీలో వర్షం కారణంగా యూరియా పంపిణీ నిలిపివేత, సాయంత్రం పంపిణీ చేయడంతో రైతుల ఆందోళన
ఇల్లందకుంట: మండలంలోని సిరిసేడు గ్రామంలో సొసైటీ ముందు యూరియా కోసం రైతులు బారులు తీరారు అయితే ఇప్పుడు వర్షం వస్తుంది యూరియా పంపిణీ చేయడం కుదరదని చెప్పడంతో రైతులు వెనుదిరిగి పోయారు. మళ్ళీ సాయంత్రం కొంతమంది రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో రైతులు అక్కడికి ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి క్యూలో నిలబడిన రైతులను ఇంటికి పంపించి ఆ తర్వాత వచ్చిన వారికి యూరియా పంపిణీ చేయడం ఏంటని ప్రశ్నించారు దీంతో సొసైటీ కార్యదర్శి రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కార్యదర్శి తో మాట్లాడి యూరియాను ఒక పద్ధతి ప్రకారం పంపిణీ చేయాలని తెలిపారు .