విశాఖపట్నం: నవంబర్ లో జరుగునున్న భాగస్వామి సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
విశాఖ వేదికగా నవంబర్ 2025లో జరుగనున్న భాగస్వామ్య సదస్సుకు జీవీఎంసీ చేపట్టవలసిన ఏర్పాట్లపై చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన భాగస్వామ్య సదస్సు జరిగే 3వ జోన్ లో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ ప్రధాన వేదిక, ఇతర పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ పర్యటించారు.ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ 2025 నవంబర్ లో విశాఖ వేదికగా జరుగనున్న భాగస్వామ్య సదస్సుకు ఎంతోమంది అతిధులు వస్తారని అందుకు విశాఖ నగరం సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు