ఈనెల 31 నుంచి వచ్చేనెల 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయూ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ కోవెలకుంట్లలో మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. జిల్లా నాయకులు ఎం. సుధాకర్, వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను దెబ్బతీసే విధంగా 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ మార్చాయన్నారు. కార్పొరేట్లకు లాభం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటున్నాయని విమర్శించారు.