పురానీహవేలీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రోడ్డుపై నిలిపి ఉన్న ద్విచక్ర వాహనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు