ఆళ్లగడ్డ: దొర్నిపాడు గ్రామంలో: మహిళా మెడలోని 50 గ్రాముల బంగారం చోరీ
నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామంలో మహిళ మెడలోని బంగారం చోరీ జరిగింది, రామలక్ష్మమ్మ ఇంటి వద్ద ఉండగా, ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చారు, భూసార పరీక్షలంటూ ఆమెను నమ్మించారు, ఒక్కసారిగా మెడలోని 50 గ్రాముల బంగారు గొలుసు లాక్కోనేందుకు ప్రయత్నించారు, ఆమె ఎదిరించడంతో ముఖంపై దాడి చేసి గాయపరిచారు, అనంతరం నిందితులు గొలుసుతో పరారయ్యారు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.