నంద్యాల అర్బన్: జిల్లా పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 149 ఫిర్యాదులు
Nandyal Urban, Nandyal | Aug 3, 2026
నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 149 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ సునీల్ సోరాన్ తెలిపారు. ప్రతి ఫిర్యాదులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను ఓపిక విని ప్రతి ఫిర్యాదు పై సమగ్ర విచారణ చేపట్టే చట్టపరిధిలో న్యాయబద్ధంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు