నంద్యాల మండలం యన్.కొత్తపల్లి మెట్ట వద్ద సోమవారంఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పల్సర్ బైక్‌పై వెళ్తున్న విశ్వ నగర్‌కు చెందిన నాగరాజు(43) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మకూర్ వైపు వేగంగా వెళ్తున్న బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.