నంద్యాల అర్బన్: నంద్యాల హోంగార్డు కుమారుడికి ఎస్పీ చేతుల మీదుగా ఆర్థిక సాయం
Nandyal Urban, Nandyal | Apr 20, 2026
నంద్యాల హోంగార్డు నాగేంద్రుడి కుమారుడి గుండె ఆపరేషన్ కోసం 'హెల్పింగ్ హ్యాండ్ సోసైటీ' అధ్యక్షుడు సద్దల చంద్రశేఖర్ రెడ్డి చొరవతో నిధులు సేకరించారు. ఈ ఆర్థిక సాయాన్ని జిల్లా ఎస్పీ సునీల్ పొరాన్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. తమకు అండగా నిలిచిన చంద్రశేఖర్ రెడ్డి, ఎన్డీఆర్ స్కూల్, ఎన్డీఆర్ ఆకాంక్ష కాలేజీల యాజమాన్యానికి హోంగార్డు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.