శ్రీశైలం టోల్గేట్ వద్ద ఐదు వాహనాలను ఢీకొన్న ప్రమోషన్స్ కు చెందిన బొలెరో వాహనం
శ్రీశైలం టోల్ గేట్ వద్ద ఒక పెను ప్రమాదం తప్పింది. ప్రమోషన్స్‌కు చెందిన బొలెరో వాహనం అదుపు తప్పి టోల్ గేట్ వద్ద ఆగి ఉన్న ఐదు వాహనాలను వరుసగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదు వాహనాలకు స్వల్ప నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి, ప్రమోషన్ వాహనాన్ని టోయింగ్ వాహనం సహాయంతో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, బొలెరో డ్రైవర్‌పై శ్రీశైలం పోలీసులు చర్యలు ప్రారంభించారు