సృజనాత్మకతను వెలికి తీయాలి - క్రోసూరులో డీఈవో వెంకటేశ్వర్లు.
విద్యార్థులకు సీబీఎస్ఈ తరగతులను బోధిస్తూ సృజనాత్మకతను కూడా వెలికి తీయాలని పల్నాడు డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు . మంగళవారం క్రోసూరులోని ప్రభుత్వం మోడల్ స్కూల్ ను ఆయన తనిఖీ చేశారు . సీబీఎస్సీ తరగతులను పరిశీలించారు. ఇంటర్ లో మంచి ఫలితాలు సాధించడం పట్ల అధ్యాపకులను అభినందించారు.