బనగానపల్లె: ఆకుమళ్ళలో 15 సంవత్సరాల తర్వాత వైభవంగా పెద్దమ్మతల్లి దేవర మహోత్సవం
నంద్యాల జిల్లా సంజామల మండలం ఆకుమల్లలో ఆదివారం గ్రామదేవత శ్రీశ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి దేవర మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి ఆలయం వద్ద క్యూలైన్లో నిలబడి దర్శనం చేసుకున్నారు. మహిళలు బోనాలు, పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.చుట్టుపక్కల గ్రామాల భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 15 సంవత్సరాల తర్వాత దేవర నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.