ఒంగోలు అర్బన్: అమరావతిలో ముందుగా భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయండి: వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
Ongole Urban, Prakasam | May 14, 2026
వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై పలు కామెంట్లు చేశారు.శ్రీవాణి టిక్కెట్లు ద్వారా మేం దోచుకుంటున్నామని గతంలో ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవాణి టిక్కెట్లు తొలగిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో శ్రీవాణి టిక్కెట్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాల్లో ఇదొకటి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తిరుమల దేవస్థానం విషయంలో మాపై మొదటి నుంచి ఏ విధంగా నెపాలు వెయ్యాలని చూస్తున్నారో దేవుడు, ప్రజలు గమనిస్తున్నారు.