కోడుమూరు: లద్దగిరి పిహెచ్సి తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో మరియు డిఎమ్ఓ
కోడుమూరు మండలంలోని లద్దగిరి పిహెచ్‌సిని మంగళవారం డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్, జిల్లా మలేరియా అధికారి నూకరాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రికార్డులు పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులను కోరారు. వర్షాల వలన దోమల పెరుగుదల లేకుండా చూడాలని, ఎవరైనా జ్వరం బారిన పడితే తగిన పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలన్నారు. అధికారులు ఆశా డే కార్యక్రమంలో పాల్గొన్నారు.