కోడుమూరు: కోడుమూరులో మేఘావృతం పలుమార్లు కురిసిన వర్షం
కోడుమూరు మండలంలో మంగళవారం మేఘావృతం ఆవరించింది. ఉదయం నుంచి మేఘాలు కమ్ముకోవడంతో పాటు పలుమార్లు జల్లులు పడ్డాయి. ఉదయం వర్షం కురువగా తిరిగి మధ్యాహ్నం, సాయంత్రం కూడా కురిసింది. అకస్మాత్తుగా జల్లులు పడడంతో బైకులపై ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మంచుతో కూడిన వర్షం పడిందని పలువురు వ్యాఖ్యానించారు.