పుంగనూరు: చింతమాకుల పల్లె చెరువుకు గండి. ఈ
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చింతమాకుల పల్లె చెరువుకు తుఫాను కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో చెరువులో పూర్తిస్థాయిలో నిండి నిండుకుండలా ఉంది. బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చింతమాకుల పల్లె చెరువుకు గండిపడి నీరు వృధాగా పోతుండడంతో రైతులు గుర్తించి ఇరిగేషన్ అధికారులకు సమాచారం తెలిపారు.