డోన్: గుటుపల్లెకు రెగ్యులర్ సర్వేయర్ ను నియమించాలంటూ గ్రామస్తుల డిమాండ్
Dhone, Nandyal | May 4, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గూటుపల్లె గ్రామానికి శాశ్వత విలేజ్ సర్వేయర్ను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. రెండేళ్ల క్రితం సర్వేయర్ కేశవ్ మరణించడంతో, అప్పటి నుంచి ఇన్ఛార్జ్లతోనే పనులు సాగుతున్నాయి. దీనివల్ల భూ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తిస్థాయి సర్వేయర్ను నియమించి తమ ఇబ్బందులు తొలగించాలని గ్రామ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.