వెదురుకుప్పం నూతన SIగా నవీన్ బాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. సాధారణ బదిలీల్లో భాగంగా చిత్తూరు వీఆర్ నుంచి వెదురుకుప్పం SIగా బాధ్యతలు స్వీకరించామన్నారు. మండల పరిధిలో శాంతి భద్రతలకు పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.