పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని, జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాయచోటిలోని పోలీసు కార్యాలయం వేదికగా నిర్వహించిన "ఓపెన్ హౌస్" కార్యక్రమం అద్భుతంగా విజయవంతమైంది. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు అమరవీరుల సంస్మరణార్థం, పోలీసు సేవలు, సాంకేతికతపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.ఈ కార్యక్రమం అక్టోబర్ 26, 27 తేదీలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుంది.