నందికోట్కూరు: పట్టణములో శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శాకంబరీ దేవిగా వాసవి మాత భక్తులకు దర్శనం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణములోని శ్రీ చక్ర సహిత కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని శాకాంబరి కూరగాయల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు, ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారికి పల్లకి సేవ లలిత సహస్రనామ స్తోత్ర కుంకుమార్చన నిర్వహించారు,మహా మంగళ హారతి అనంతరం గోరింటాకు సమర్పించారు, సుమంగళి కరమైన గోరింటాకును ఆలయమునకు వచ్చిన సుహాసినులు అమ్మవారి సమక్షంలో గోరింటాకు పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులు పొందారు, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ పెద్దలు మహిళా సంఘ సభ్యులు ఆర్యవైశ్య మహిళలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు