ఉరవకొండ: గ్రామాల్లో శానిటేషన్ వర్క్ చేయించి క్రిమిసంహారక మందుల పిచికారి చేయించిన అధికారులు
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటంపల్లి వెంకటం పల్లి పెద్ద తండా,చిన్న తండా, జరుట్ల రాంపురం, జరుట్ల రాంపురం కొట్టాల గ్రామాల్లో బుధవారం ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అధికారులు శానిటేషన్ వర్క్ చేయించి మలేరియా వర్కర్ల చేత క్రిమిసంహారక ముందును ఇంటింటా పిచికారి చేయించారు. ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి గ్రామపంచాయతీ కార్యదర్శి మురళీమోహన్ హెల్త్ అసిస్టెంట్ బి నాగరాజు వైద్య ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు కలసి ఇంటింటా తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించారు.