పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో 8 బార్లకు లాటరీ ప్రక్రియ ద్వారా లబ్ధిదారులు ఎంపిక
పల్నాడు జిల్లాలో 30 బార్లకు రీ నోటిఫికేషను జారీ చేశారు. 8 బార్ అండ్ రెస్టారెంట్లకు మాత్రమే 32 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ ఎస్పీ మణికంఠ తెలిపారు. గురువారం కలెక్టర్ కృత్తికా శుక్ల చేతుల మీదుగా 8 బార్లకు లాటరీ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాలో నరసరావుపేట మున్సిపాలిటీ 1, వినుకొండ 3, పిడుగురాళ్ల 2, చిలకలూరిపేట 2 బార్లకు లాటరీ ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారులు ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు.