దర్శి: దర్శి నియోజకవర్గంలో ఓటర్ల మార్పులు చేర్పుల కోసం ఎలక్షన్ కమిషన్ అవకాశం: ఈ ఆర్ ఓ జాన్సన్
Darsi, Prakasam | May 15, 2025 దర్శి నియోజకవర్గ పరిధిలో ఓటర్ల మార్పులు, చేర్పులకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించిందని దర్శి నియోజకవర్గ ఈఆర్ఓ జాన్సన్ తెలిపారు ఈ సందర్భంగా దర్శి తహాసిల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల తహాసిల్దారులతో మరియు రాజకీయ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లకు సంబంధించి మార్పులు,చేర్పులు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.