డోన్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం: డోన్ సిడిపిఓ శంషాద్ బేగం
Dhone, Nandyal | May 15, 2026 బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని డోన్ సీడీపీవో శంషాద్ బేగం, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి శ్రీనివాస్ అన్నారు. బేతంచెర్ల మండలంలోని సీతారామపురంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధమ్మ ఆధ్వర్యంలో కిషోరీ వికాసం వేసవి శిక్షణ సెషన్-5 నిర్వహించారు. యుక్త వయస్సు అబ్బాయిలు, అమ్మాయిలకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని వారు సూచించారు.