పామూరు పట్టణంలో నూతనంగా నిర్మించనున్న హుస్సేనీ మసీదు, మదరసాల నిర్మాణానికి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మసీదులలో పనిచేసే ఇమాములు, మౌజాములకు గౌరవ వేతనం ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుంది అన్నారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.