నంద్యాల- గిద్దలూరు నల్లమల్ల ఘాట్ రోడ్ లో కారు బోల్తా, నంద్యాల జిల్లాకు చెందిన ఆరుగురికి గాయాలు
Nandyal Urban, Nandyal | Apr 13, 2026
మర్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో టయోటా ఇన్నోవా కారు అదుపుతప్పి బోల్తా పడింది. పాణ్యం నుంచి గుంటూరుకు వెళుతుండగా రోడ్డు మార్జిన్ వద్ద కల్వర్టును ఢీకొట్టినట్లు సమాచారం. కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా, వారిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.