విశాఖపట్నం: అండగా ఉంటాం...కూటమితోనే తేల్చుకుందాం ...చిరు వ్యాపారులకు వాసుపల్లి భరోసా
విశాఖలో షాపుల తొలగింపుపై దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీబొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని వాసుపల్లి పేర్కొన్నారు. పేదలకు న్యాయం జరిగేవరకూ అండగా ఉంటామని, షాపులు తొలగించిన నేపథ్యంలో బాధితులకు నష్టపరిహారం కూడా ఇప్పిస్తామని, షాపులు తిరిగి తెరిచే విధంగా పోరాడతామన్నారు. ఈసదర్భంగా బాధితులకు కలిసి ఆందోళన నిర్వహించారు.