కనగల్: మండలంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి నేలకొరిగిన పంట పొలాలు, ఆందోళన చెందుతున్న రైతులు
నల్గొండ జిల్లా, కనగల్ మండలంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చేతికందరికిన పంట నేలకొరిగింది. మంగళవారం ఉదయం పలువురు రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిణి కార్తిలో హరి పోసి ముందస్తుగా నాట్లు వేసుకున్న వరి పంట కోత దశకు చేరుకుంది. చేతికి అందొచ్చిన పంట నేలకొరవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అంట నేలకొరవడం వల్ల వడ్లు మొలకెత్తి అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. మండలంలోని పగిడిమర్రి, దొరెపల్లి, జి ఎడవల్లి, బోయినపల్లి పలు గ్రామాలలో భారీ వర్షం రైతులకు నష్టం మిగిల్చింది. నష్టపోయిన ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.