డోన్: డోన్ నియోజకవర్గం అమరావతి రాజధాని బిల్లుకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించిన టిడిపి శ్రేణులు
Dhone, Nandyal | Apr 2, 2026 అమరావతికు రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో డోన్లో ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పాత బస్టాండ్ గాంధీ సర్కిల్ వరకు కొనసాగింది. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అమరావతి రాజధానికి మద్దతు తెలుపుతూ కేక్ కటింగ్ చేశారు.