దస్తూరాబాద్: బూరుగుపల్లి అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో బర్డ్ వాక్ ,సందర్శకులను ఎంతో ఆకట్టుకుంది.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఆటవీ రేంజ్ పరిధిలోని కిష్టంపేట, భీమారం మండలంలోని బూరుగుపల్లి అటవి ప్రాంతంలో ఆటవిశాఖ ఆద్వర్యంలో బర్డ్ వాక్ నిర్వహించారు. శనివారం సాయంత్రం కిష్టంపేటలోని అంబేద్కర్ ఈకో టూరిజిమ్ పార్క్ సందర్శకులు రిజిస్ట్రేషన్ చేసుకొని రాత్రి క్యాంప్ ఫైర్ నిర్వహించారు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు కిష్టంపేట అర్బన్ పార్కు నుండి సఫారి వాహనాల్లో బూరుగుపల్లి సమీపంలోని గొల్లవాగు ప్రాజెక్టుకు చేరుకొనిబర్డ్ వాచింగ్ పాల్గొన్నారు. అక్కడ ఎన్నో రకాల పక్షులను గుర్తించారు.