నంద్యాల అర్బన్: నల్లమల్ల ఘాట్రోడ్లో బొలెరో వాహనం బోల్తా,పలువురు కూలీలకు గాయాలు
Nandyal Urban, Nandyal | Apr 27, 2026
నంద్యాల- గిద్దలూరు రహదారి నల్లమల ఘాట్ రోడ్ లో బొలెరో వాహనం బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. సోమవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కూలీలు గిద్దలూరు పనులను నిమిత్తం వెళ్తున్నారు. అదే సమయంలో ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిని అదే వాహనంలో ఎక్కించుకొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు బొలెరో వాహనం బోల్తా పడి కూలీలకి గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనాల్లో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.