ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జాతీయ రాష్ట్రీయ రహదారులపై ప్రమాదాల నివారణకు స్టాపర్లు ఏర్పాటు చేసిన పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 16, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో మంగళవారం రోడ్డు ప్రమాదల నివారణకు పోలీసులు జాతీయ రాష్ట్రీయ రహదారిపై స్టాపర్లను ఏర్పాటు చేశారు. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి స్టాపర్లను ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా మూలమలుపులు తిరిగే వద్ద మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వాహనదారులు కూడా మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదల బారిన పడకుండా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు.