కోడుమూరు: కోడుమూరులో రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలని వామపక్షాలు ర్యాలీ, మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ కోడుమూరులో వామపక్ష నాయకులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోట్ల సర్కిల్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కర్నూలు జిల్లా పర్యటనలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ వెనుకబడ్డ జిల్లాలకు ప్యాకేజీ, కర్నూలు బళ్లారి రహదారి విస్తరణ, పెండింగ్ ప్రాజెక్టులపై ప్రకటించాలని డిమాండ్ చేశారు.