నంద్యాల అర్బన్: నంద్యాలలో సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ యాక్ట్ పై అవగాహన కార్యక్రమం
Nandyal Urban, Nandyal | May 5, 2026
నంద్యాల పట్టణంలో నిశాంత్ నందు మంగళవారం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్టిఓ ట్రిబ్యునల్ చైర్మన్ విశ్వనాథ్ పాల్గొని మాట్లాడారు. సీనియర్ సిటిజల్లు తమ పిల్లలకు ఆస్తులు వ్రాసి ఇచ్చేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై సీనియర్ సిటిజన్లకు, డాక్యుమెంట్ రైటర్లకు అవగాహన కల్పించారు. అవసరమైతే ట్రిబ్యునల్ ఆచరించి భరణం పొందవచ్చని తెలిపారు. పిల్లలు సరిగా చూసుకోకపోతే ఆస్తులను ఉపసంహరించుకునే హక్కు ఈ చట్టం కల్పిస్తుందని తెలిపారు