రాయచోటి వీరభద్రస్వామి ఆలయంలో ఉద్యోగి చోరీ యత్నం:ఆలయ ఈవో డివి రమణారెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఉద్యోగి చోరీ యత్నం పెద్ద కలకలం రేపింది. ఆలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.వి. కొండయ్య సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఈవో కార్యాలయంలోకి ప్రవేశించి, భక్తులు సమర్పించిన 86 గ్రాముల వెండి గొడుగు, 31.200 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించేందుకు ప్రయత్నించాడు.సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై కొండయ్యను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన ఆలయ ఈవో డివి రమణారెడ్డి అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. చోరీ యత్నం నిజమని తేలడంతో కొండయ్యను ఉద్యోగం నుంచి తొలగించి, పైగా పోలీసులకు ఫిర్యాదు