రాజమండ్రి సిటీ: సేవా పక్వాడ కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి : రాజమండ్రిలో ఎంపీ పురందేశ్వరి
ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి తెలిపారు. బుధవారం ఆమె రాజమండ్రిలో మాట్లాడుతూ, ప్రజలను సేవా రంగం వైపు నడిపించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు