సంతనూతలపాడు: అమ్మనబ్రోలు శ్రీ చెన్నకేశవ స్వామి దసరా శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై ఆలయ కమిటీ సభ్యులతో చర్చించిన ఎస్సై రజియా సుల్తానా
నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో ఎస్సై రజియా సుల్తానా బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో త్వరలో ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై ఆలయ కమిటీ సభ్యులతో ఎస్సై చర్చించారు. శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా బందోబస్తు చర్యలపై ఆలయ కమిటీతో ఎస్సై చర్చించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆలయ కమిటీకి ఎస్ఐ సూచించారు.