బనగానపల్లె: బనగానపల్లెలో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నంద్యాల జిల్లా బనగానపల్లె పార్టీ కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకుడు బీవీ సుబ్బారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజపేయి తొలి అధ్యక్షుడిగా బీజేపీ స్థాపించబడిందని ఆయన గుర్తుచేశారు. ప్రతి ఏటా ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్య కర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని పార్టీ బలోపేతానికి ప్రతిజ్ఞ చేశారు.