వికారాబాద్: జిల్లాలో సీసీ రోడ్ల అభివృద్ధి పనులు జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం
జిల్లాలో జరిగే సీసీ రోడ్ల అభివృద్ధి పనులు జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు బుధవారం ఆదేశించారు. అభివృద్ధి చేసి పనులు పూర్తైన వాటికి ఎఫ్‌టీఓ జనరేట్ చేయాలని పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ రాజ్ ఈఈ, డీఈలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పనుల అభివృద్ధిపై అడిగి తెలుసుకున్నారు.