బోయిన్పల్లి: మండల కేంద్రం శివారులో ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టి వెళ్లిపోయిన గుర్తుతెలియని వాహనం
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండల కేంద్రం శివారులో,ఆదివారం 9:20 PM కి ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీ కొట్టిన సంఘటన చోటుచేసుకుంది,జగిత్యాల కు చెందిన ఇక్బాల్ తన ద్విచక్ర వాహనంపై,బోయినపల్లికి వెళ్తున్న క్రమంలో గ్రామ శివారు ప్రాంతం వద్దకు రాగానే,ఫోన్లో మాట్లాడుతూ వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న మరో గూడ్స్ వాహనం ఇక్బాల్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది,దీంతో రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలయి రోడ్డు పక్కన అచేతన స్థితిలో పడి ఉన్న ఇక్బాల్ ను,స్థానికులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు,ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది,