బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ నికత్ జరీన్ మంగళవారము మక్తల్ ఎమ్మెల్యే రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి బాక్సర్ నికత్ జరీన్ ను అభినందించి శాలువాతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల కాలంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కప్ 20 25 లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ క్రీడాకారిణి నికత్ జరీన్ అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని వివిధ స్థాయిలో మెడల్స్ సాధించి దేశ రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచాలని మంత్రి ఆకాంక్షించారు.