గరిడేపల్లి: కట్టవారి గూడెంలో పేకాట స్థావరం పై పోలీసుల దాడి.. 10 మంది పట్టివేత, 7 సెల్ ఫోన్స్, రూ 4250 నగదు స్వాధీనం
గరిడేపల్లి మండలంలోని కట్టవారి గూడెం గ్రామంలో పేకాట ఆడుతున్న గుంపుపై ఆదివారం పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడి పేకాట స్థావరాన్ని గుర్తించిన పోలీసులు దాడి జరిపారు. పేకాట ఆడుతున్న మొత్తం 14 మందిలో ముగ్గురు పారిపోయినప్పటికీ మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిదగ్గర నుంచి 7 మోటార్ బైకులు, 7 సెల్ఫోన్లు, ₹4,250 నగదు స్వాధీనం చేసుకున్నారు.