తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వ్యవసాయ మార్కింగ్ కార్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భముగా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ చేతులు మీదుగా డాక్టర్ BR అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ BR అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలతో దేశ ప్రజలకు అమూల్యమైన రాజ్యాంగం లభించిందని అన్నారు, ఈ కార్యక్రమం లో AMC సెక్రెటరీ రామమ్మ, వైస్ చైర్మన్ రవీంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ పాల్గొన్నారు.