ఆళ్లగడ్డ: జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో ఆళ్లగడ్డ యువ రెజ్లర్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన యువ రెజ్లర్ నరేంద్ర హర్యానాలో జరుగుతున్న జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో ప్రతిభ చాటేందుకు బరిలో దిగాడు,RR అకాడమీకి చెందిన నరేంద్ర ఎంపిక కావడం పట్ల కోచ్ లు అకాడమీ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు, పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచి జాతీయస్థాయిలో పతకం సాధించి ఆళ్లగడ్డకు మంచి పేరు తేవాలన్నారు, స్థానిక ఆళ్లగడ్డ క్రీడాకారులు కూడా నరేంద్రకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయస్థాయిలో విజయం సాధించాలన్నారు