ఒంగోలు అర్బన్: పది సంవత్సరాలుగా పనిచేసిన పార్టీలో గుర్తింపు లేదు: వైసీపీలో చేరిన సర్వేరెడ్డి పాలెం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు
Ongole Urban, Prakasam | Jun 10, 2026
గుర్తింపు లేకపోవడం వల్లే పార్టీ మారేమని ఒంగోలు మండలం సర్వేరెడ్డి పాలెం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు తెలిపారు. బుధవారం ఒంగోలు వైసిపి కార్యాలయంలో ఇన్ ఛార్జ్ రవిబాబు ఆధ్వర్యంలో 50 మంది టిడిపిని వీడి వైసీపీలో చేరారు. 10 సంవత్సరాలుగా గ్రామంలో ఆర్వో ప్లాంట్ పెట్టి గ్రామస్తులకు ఉచితంగా మంచినీరు అందించామని పార్టీకి ఎంతో సేవ చేసిన టిడిపి పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో వైసిపి ఘనవిజయం సాధించేలా పనిచేస్తామని వారు తెలిపారు.